: యోగా తిరుగులేని వ్యాయామం అంటున్న ముస్లిం మతపెద్దలు
శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా తిరుగులేని వ్యాయామం అని రాజస్థాన్ ముస్లిం మతపెద్దలు అంటున్నారు. ఈ పురాతన వ్యాయామ విద్యను ప్రత్యేకంగా ఓ మతంతో ముడిపెట్టడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు. బుండి పట్టణ 'ఖాజీ' అబ్దుల్ షాకూర్ మాట్లాడుతూ... పరిపూర్ణ ఆరోగ్యానికి యోగా ఆచరణ మంచిదని, అయితే, యోగా విషయంలో రాజకీయనేతల వ్యాఖ్యలు విచారకరమని అన్నారు. ప్రతి రోజు తాను యోగా చేస్తానని, యోగా చేయాలని ముస్లింలతో సహా, ప్రతి ఒక్కరికి సూచిస్తానని తెలిపారు. కోటా పట్టణ 'ఖాజీ' అన్వర్ అహ్మద్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. యోగాను మించిన వ్యాయామం లేదని తెలిపారు. 'సూర్య నమస్కారం' ఓ మతానికే చెందినదనడం ఆమోదయోగ్యం కాదన్నారు.