: మా కుర్రాళ్లు టీమిండియాను ఆశ్చర్యపరుస్తారు: బంగ్లాదేశ్ కెప్టెన్ మొర్తజా


భారత్ తో వన్డే సిరీస్ కు తాము సిద్ధంగా ఉన్నామని బంగ్లాదేశ్ వన్డే జట్టు కెప్టెన్ మష్రఫే మొర్తజా స్పష్టం చేశాడు. భారత్ తో ఆడడం ఎప్పుడూ పెద్ద సవాలేనని అన్నాడు. అయితే, తమ జట్టులో కుర్రాళ్లున్నారని, ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్ కనబరుస్తున్న వాళ్లు టీమిండియాను ఆశ్చర్యపరుస్తారని తెలిపాడు. ఇక, తన గాయం గురించి మాట్లాడుతూ... కోలుకున్నానని, నెట్స్ లో బ్యాటింగ్, బౌలింగ్ చేశానని వివరించాడు. రేపు (గురువారం) జరిగే మ్యాచ్ లో ఆడతాననే భావిస్తున్నానని తెలిపాడు. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా రేపు జరిగే మ్యాచ్ పైనే దృష్టిపెట్టామని, అంతకన్నా ఎక్కువ దూరం ఆలోచించడం లేదని మొర్తజా స్పష్టం చేశాడు. తొలి మ్యాచ్ లో విజయం సాధించడం తమకెంతో ముఖ్యమని అన్నాడు.

  • Loading...

More Telugu News