: 'జల్లికట్టు'పై నిషేధం ఎత్తివేతకు ప్రయత్నిస్తాం: జవదేకర్
తమిళనాట బాగా ప్రజాదరణ పొందిన 'జల్లికట్టు'పై నిషేధాన్ని ఎత్తివేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. తమిళనాడులో 'పొంగల్' పండుగ సందర్భంగా జరిగే జల్లికట్టు క్రీడలో... వ్యక్తులు బాగా మదమెక్కిన వృషభాలను నియంత్రించడానికి ప్రయత్నిస్తారు. అయితే, ఇది జంతువుల హక్కులకు వ్యతిరేకమంటూ సుప్రీం కోర్టు గతేడాది నిషేధం విధించింది. జల్లికట్టుపై నిషేధం రాష్ట్రంలో పొంగల్ వేడుకలపై ప్రభావం చూపుతోందని, శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ క్రీడను అనుమతించాలని డిమాండ్లు వస్తున్నాయి. దీనిపై మంత్రి జవదేకర్ మాట్లాడుతూ... అవసరమైతే చట్టాలను సవరించేందుకు సిద్ధమని స్పష్టం చేశారు.