: పరిటాల శ్రీరామ్ పై కేసు కొట్టివేత
అనంతపురం జిల్లా ధర్మవరం కోర్టులో పరిటాల శ్రీరామ్ కు ఊరట లభించింది. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో అతనిపై నమోదైన కేసును ఈ రోజు న్యాయస్థానం కొట్టివేసింది. ఎన్నికల్లో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. దానిని విచారించిన కోర్టు సరైన సాక్ష్యాధారాలు లేవంటూ కేసును కొట్టివేసింది.