: వాళ్లు దేవుడిని క్షమాపణ కోరాలి: పోప్
ఆశ్రయం కోరుతూ మరో దేశానికి వెళ్లే వలసదారుల పట్ల గౌరవం చూపాలంటున్నారు పోప్ ఫ్రాన్సిస్. అలాంటి నిర్భాగ్యుల పట్ల నిరాదరణ చూపే వ్యక్తులు, సంస్థలు దేవుడిని క్షమాపణ కోరాలని సూచించారు. ఫ్రాన్స్, ఇటలీ సరిహద్దు ప్రాంతంలో చోటుచేసుకున్న 'వలస' సంక్షోభం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటలీ నుంచి భారీ సంఖ్యలో వలసదారులు వస్తుండడంతో ఫ్రాన్స్, ఆస్ట్రియా దేశాలు కఠిన ఆంక్షలు విధించాయి. దీంతో, రోమ్, మిలాన్ రైల్వే స్టేషన్ల వద్ద వలసవాదులు పెద్ద సంఖ్యలో నిలిచిపోయారు. దీనిపై పోప్ ఆవేదన వ్యక్తం చేశారు. "ఈ మన సోదరులు, సోదరీమణులు స్వస్థలాలకు దూరంగా ఆశ్రయం కోరుతున్నారు. భయం లేకుండా బతికేందుకు ఓ ఆవాసం కోసం చూస్తున్నారు" అని ఆయా దేశాలకు విజ్ఞప్తి చేశారు. అలాంటి వారిని ఆదుకోవాలని పిలుపునిచ్చారు.