: భారత్ వచ్చి చట్టాన్ని ఎదుర్కోవాలని లలిత్ మోదీకి చెప్పా: శరద్ పవార్
వీసా డాక్యుమెంట్ల వ్యవహారంలో తనకు ముగ్గురు యూపీఏ మంత్రులు సహకరించారంటూ అందులో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేరును కూడా ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ వెల్లడించారు. దానిపై పవార్ తొలిసారి వివరణాత్మకంగా ప్రతిస్పందించారు. కొన్ని వారాల కిందట లండన్ లోని ఓ రెస్టారెంట్ లో లలిత్ ను కలిశానని, భారత్ కు తిరిగొచ్చి, చట్టాన్ని ఎదుర్కోవాలని తాను చెప్పానని పవార్ తెలిపారు. "ముూడు,నాలుగు వారాల కిందట లండన్ లోని ఓ రెస్టారెంట్ లో లంచ్ కు వెళ్లినప్పుడు లలిత్ మోదీని కలిశాను. మళ్లీ భారత్ కు వచ్చి చట్టాన్ని ఎదుర్కోవాలని చెప్పాను" అని ఆంగ్ల చానల్స్ తో పవార్ పేర్కొన్నారు. అయితే సెక్యూరిటీ సమస్య వల్ల తాను తిరిగిరాలేకపోతున్నానని, ఒకవేళ వస్తే మళ్లీ తన పాస్ పోర్టును స్వాధీనం చేసుకుంటారని మోదీ చెప్పాడన్నారు.