: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి... భేటీలపై భేటీలు


ఓటుకు నోటు కేసులో రాజకీయాలు, పోలీసుల వ్యూహాలు క్షణక్షణం మారుతుండడంతో వేడి పెరుగుతోంది. తాజా పరిణామాలతో నేతలు భేటీల మీద భేటీలు జరుపుతూ బిజీగా ఉన్నారు. ఈ ఉదయం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రివర్గ సభ్యులను పిలిపించుకుని హైదరాబాదులో జరుగుతున్న పరిణామాల గురించి ఆరా తీశారు. ఈ సమావేశానికి ఏపీ డీజీపీ జేవీ రాముడు కూడా హాజరయ్యారు. వేం నరేందర్ రెడ్డి, సండ్రలకు ఇచ్చిన నోటీసులపై ఆరా తీశారు. ఆపై ఈ మధ్యాహ్నం లోటస్ పాండ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సమావేశమయ్యారు. తాజా రాజకీయాలు, అందులో వైకాపా ఎటువంటి పాత్రను తీసుకోవాలన్న విషయమై వీరి మధ్య చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి విమర్శలకు దిగకుండా ఏం జరుగుతుందో చూద్దామని నిర్ణయించుకున్నట్టు సమాచారం. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం డీజీపీ, ఏసీబీ డైరెక్టర్, హైదరాబాదు కమిషనర్ లతో సమావేశమయ్యారు. తదుపరి చట్టపరమైన చర్యలు ఎలా ముందుకుసాగనున్నాయన్న సమాచారాన్ని ఆయన అడిగినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో తెలంగాణ టీడీపీ నేతలు భేటీ అయి చర్చలు జరిపారు. ఏసీబీ కేసుల్లో ఇరుక్కున్న అత్యధికులు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే కావడంతో, కేసుల నుంచి బయటపడాలన్న విషయమై వారు చర్చించినట్టు సమాచారం. అటు జిల్లాల స్థాయిల్లోనూ అన్ని పార్టీల నేతల మధ్యా ఇదే చర్చ జరుగుతోంది.

  • Loading...

More Telugu News