: అంగారక గ్రహంపై జీవం సాధ్యమేనంటున్న 'మీథేన్'!


కఠినమైన వాతావరణం కలిగివుండే గ్రహంగా అంగారకుడికి పేరుంది. ఈ అరుణ వర్ణ గ్రహంపై జీవం సాధ్యమేనంటున్నారు అమెరికా పరిశోధకులు. అంగారక గ్రహానికి చెందిన శిలలపై పరిశోధనలు నిర్వహించడం ద్వారా వారు ఈ నిర్ణయానికి వచ్చారు. వారు పరిశీలించిన అన్ని శిలల్లోనూ మీథేన్ ఉన్నట్టు గుర్తించారు. అంగారక గ్రహంపై మూలాధార జీవులు మీథేన్ ను ఆహార వనరుగా ఉపయోగించుకుని ఉంటాయని వారు ఓ అంచనాకు వచ్చారు. భూమిపై మైక్రోబ్స్ ఇలాగే మీథేన్ ను వినియోగించుకుంటాయని పరిశోధనలో పాలుపంచుకున్న షాన్ మెక్ మహోన్ (యేల్ యూనివర్శిటీ) తెలిపారు. మార్స్ లో లభ్యమయ్యే మీథేన్ అయినాగానీ మైక్రోబ్స్ కు నేరుగా అందదని అన్నారు. మీథేన్ వాయువు జీవి ఉనికికి ఆధారమని వివరించారు. జీవరసాయనిక చర్య కారణంగానే మీథేన్ వెలువడుతుందని తెలిపారు.

  • Loading...

More Telugu News