: టీడీపీకి సెక్షన్-8 ఇప్పుడే గుర్తుకొచ్చిందా?: ఏపీ కాంగ్రెస్
టీడీపీ నేతలపై ఏపీ కాంగ్రెస్ నేతలు సి.రామచంద్రయ్య, శైలజానాథ్ విమర్శలు గుప్పించారు. ఏపీ మంత్రులు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. ఇన్నాళ్లుగా లేనిది, సెక్షన్-8 ఇప్పుడే గుర్తుకు వచ్చిందా? అని ప్రశ్నించారు. హైదరాబాదులో ఏపీ పోలీస్ స్టేషన్లు పెడతామని మంత్రులు వ్యాఖ్యానించడమేంటని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో కూడా ఏపీ పీఎస్ లు పెడతారా? అని ప్రశ్నించారు. ఏపీలో పాలనను గాలికొదిలేశారని... యంత్రాంగం మొత్తం ఓటుకు నోటు వ్యవహారంపైనే పనిచేస్తోందని... ఇది మంచిది కాదని అన్నారు.