: నేపాల్ లో మరోసారి ప్రకంపనలు
ఇప్పటికే భారీ భూకంపంతో పాటు వందలాది చిన్నచిన్న ప్రకంపనలతో వణికిన నేపాల్ లో ఇవాళ మరోసారి మూడు సార్లు స్వల్ప స్థాయి ప్రకంపనలు సంభవించాయి. ఈ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4, 5.2, 5.1గా నమోదయ్యాయి. ఇవి రామ్ కోట్, సింధుపాల్ చౌక్ ప్రాంతాల్లో సంభవించాయని అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 25న నేపాల్ ను అతలాకుతలం చేసిన భూకంపం సంభవించిన తర్వాత, ఇప్పటి వరకు 320 సార్లు భూప్రకంపనలు సంభవించాయి.