: భారత్-బంగ్లాదేశ్ తొలి వన్డేకు వాన గండం!


భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య వన్డే సిరీస్ గురువారం ఆరంభం కానుంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా జరిగే తొలి మ్యాచ్ కు మిర్పూర్ లోని షేర్-ఏ-బంగ్లా స్టేడియం వేదిక. ప్రస్తుతం బంగ్లాదేశ్ లోనూ రుతుపవనాల సీజన్ కావడంతో మ్యాచ్ కు వాన గండం తప్పదని భావిస్తున్నారు. వరుణుడి ప్రభావంతో ఇరు జట్ల మధ్య ఏకైక టెస్టు డ్రాగా ముగియడం తెలిసిందే. ఇప్పుడు వన్డే సిరీస్ పైనా వరుణుడు పంజా విసిరితే అటు అభిమానులకే కాదు, ఇటు స్పాన్సర్లకూ నిరాశ తప్పదు. ఇక, టెస్టులో ఆధిపత్యం ప్రదర్శించినా డ్రాతో సరిపెట్టుకోవాల్సి రావడం టీమిండియా పరంగా నిరాశాజనక ఫలితమే. దీంతో, వన్డే సిరీస్ లో సత్తా చాటాలని తహతహలాడుతోంది.

  • Loading...

More Telugu News