: ఏపీ సీఐడీ అదుపులో మత్తయ్య...ప్రాణహాని ఉందంటున్న ‘ఓటుకు నోటు’ నిందితుడు
ఓటుకు నోటు కేసులో కీలక నిందితుడిగా పరిగణిస్తున్న జెరూసలెం మత్తయ్యను ఏపీ సీఐడీ పోలీసులు కొద్దిసేపటి క్రితం అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఆయనను నుంచి మరిన్ని వివరాలు సేకరించడంతో పాటు పలు ఆధారాలు రాబట్టే పనిలో సీఐడీ అధికారులు నిమగ్నమయ్యారు. ఇదిలా ఉంటే, కేసులో తమకు అనుకూలంగా వాంగ్మూలమివ్వకుంటే చంపేస్తామని టీఆర్ఎస్ శ్రేణుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని మత్తయ్య పోలీసులకు చెప్పారు. దీంతో అతడి నుంచి ఫిర్యాదు తీసుకున్న విజయవాడ, సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేశారు.