: ప్రముఖ ఆర్కిటెక్ చార్లెస్ కొరియా కన్నుమూత


దేశ ప్రఖ్యాత ఆర్కిటెక్ చార్లెస్ కొరియా తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత అర్ధరాత్రి ముంబైలో చనిపోయారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. చార్లెస్ అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారత్ లో నిర్మాణ రంగాన్ని అభివృద్ధి చేయడంలో చార్లెస్ పాత్ర వెలకట్టలేనిది. పలు అద్భుతమైన నిర్మాణాలు డిజైన్ చేసిన ఆయన అహ్మదాబాద్ లోని మహాత్మాగాంధీ మెమోరియల్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ భవన నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించారు. పట్టణ ప్రణాళిక, చవక గృహాల రూపకల్పనలో ఆయన నిపుణుడు. 1970లో నవీ ముంబయ్ కు చీఫ్ ఆర్కిటెక్ గా ఉన్నారు. నిర్మాణ రంగంలో ఆయన కృషికిగానూ పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. 1972లో పద్మశ్రీ, 2006లో పద్మ విభూషణ్ పురస్కారాలతో చార్లెస్ ను ప్రభుత్వం గౌరవించింది. సెప్టెంబర్ 1, 1930లో సికింద్రాబాద్ లో జన్మించిన కొరియా, ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజ్ లో చదువుకున్నారు.

  • Loading...

More Telugu News