: గవర్నర్ ను రీకాల్ చేయాలి: నన్నపనేని డిమాండ్
గవర్నర్ నరసింహన్ పై విమర్శలు గుప్పిస్తున్న వారి జాబితాలో టీడీపీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి కూడా చేరిపోయారు. నరసింహన్ కు రాజ్యాంగం కూడా తెలియదని... అలాంటి వ్యక్తిని వెంటనే రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు. గవర్నర్ టీఆర్ఎస్ పార్టీ పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి కేసు చాలా చిన్న వ్యవహారమని, ఫోన్ ట్యాపింగ్ చాలా పెద్ద అంశమని రాజకుమారి చెప్పారు. ట్యాపింగ్ పై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయాలని కోరారు.