: సండ్రకు మరోసారి ఏసీబీ నోటీసులు...ఎల్లుండి సాయంత్రం 5 గంటల్లోగా విచారణకు రావాలని ఆదేశం


ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు తెలంగాణ ఏసీబీ మరోమారు నోటీసులు జారీ చేసింది. నిన్న రాత్రి హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని వీరయ్య నివాసం నెం.208 క్వార్టర్ లో నోటీసుల కాపీలను ఏసీబీ అధికారులు కిటికీ ద్వారా జారవిడిచిన సంగతి తెలిసిందే. అయితే నేటి మధ్యాహ్నం దాకా వీరయ్య నుంచి ఏసీబీ అధికారులకు ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఏసీబీ అధికారులు మరోమారు నోటీసులు జారీ చేయాల్సి వచ్చింది. కొద్దిసేపటి క్రితం నోటీసులతో రెండోసారి వీరయ్య క్వార్టర్ వద్దకు వెళ్లిన ఏసీబీ అధికారులకు ఈ దఫా కూడా తాళమే దర్శనమిచ్చింది. అయితే ఈ సారి కిటికీ గుండా నోటీసులను ఇంటిలో వేయకుండా, క్వార్టర్ గుమ్మానికి నోటీసుల కాపీని ఏసీబీ అధికారులు అంటించారు. ఎల్లుండి సాయంత్రం 5 గంటల్లోగా విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో సండ్ర వెంకటవీరయ్యకు ఏసీబీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News