: కేసీఆర్ తో జగన్ మిలాఖత్...చంద్రబాబుపై దుష్ప్రచారం: ఏపీ మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి
ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆయన సొంత జిల్లా కడపకు చెందిన టీడీపీ నేత, ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి మరోమారు ఫైరయ్యారు. తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో మిలాఖత్ అయిన జగన్ ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఏపీకి చెందిన జగన్, తెలంగాణకు చెందిన కేసీఆర్ తో ఎలా కుమ్మక్కవుతారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో వైసీపీ అధ్యక్షుడిగా కేసీఆర్, ఏపీలో టీఆర్ఎస్ కు అధ్యక్షుడిగా జగన్ వ్యవహరిస్తున్నారని సతీష్ రెడ్డి దుయ్యబట్టారు.