: సుష్మాతో పాటు వసుంధరా రాజే కూడా పదవి నుంచి తప్పుకోవాలి: కాంగ్రెస్ డిమాండ్
ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ వ్యవహారంలో తాజాగా రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజేపై ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. లలిత్ కు సాయం చేసిన విషయంలో సుష్మాతో కలసి వసుంధరా కూడా పదవి నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి శోభా ఓజా డిమాండ్ చేశారు. ఈ వివాదంపై ఇప్పటివరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మౌనం వహించడంవల్ల ఆ నేతలిద్దరికీ మద్దతిస్తున్నారని అర్థం చేసుకోవల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్ చేత దర్యాప్తు చేయించాలని కాంగ్రెస్ కోరుతోందని చెప్పారు.