: కావలి ఎమ్మెల్యేకు నకిలీ అధికారి టోకరా... రూ.84 వేలతో పరారీ


తెలుగు రాష్ట్రాల్లో నకిలీ అధికారుల హల్ చల్ కొనసాగుతోంది. మొన్న హైదరాబాదు పరిధిలోని మల్కాజిగిరీ ఎంపీ, ఎమ్మెల్యేలను బోల్తా కొట్టించిన యువకుడు పోలీసులకు దొరికిపోయాడు. తాజాగా ఏపీలోని నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి మరో యువకుడు మస్కా కొట్టాడు. డ్వాక్రా రుణాలను రద్దు చేసే అధికారినంటూ రంగంలోకి దిగిన సదరు యువకుడి మాటలకు ఎమ్మెల్యే బోల్తా పడ్డారు. దాదాపు 284 డ్వాక్రా సంఘాల నుంచి రూ.300 చొప్పున వసూలు చేసి సదరు నకిలీ అధికారి బ్యాంక్ అకౌంట్ లో రూ.80 వేలు జమ చేశారు. తీరా డబ్బు తీసుకున్న తర్వాత సదరు నకిలీ అధికారి గుట్టుచప్పుడు కాకుండా ఉడాయించాడు. కాస్త ఆలస్యంగా సదరు యువకుడి మోసాన్ని గుర్తించిన ఎమ్మెల్యే కావలి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News