: డబ్బులు తీసుకుంటానని చెప్పిన స్టీఫెన్ ది తప్పుకాదా? ఆయనను ఎందుకు అరెస్ట్ చేయలేదు?: గాలి ముద్దుకృష్ణమ నాయుడు


టీఆర్ఎస్ ప్రభుత్వం, టి.ఏసీబీపై టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు విరుచుకుపడ్డారు. టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఏసీబీ తొత్తుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తాము చేస్తున్నది తప్పని తెలిసినా, ఏసీబీ అధికారులు ఆ విషయాన్ని కేసీఆర్ కు ఎందుకు వివరించలేదని ప్రశ్నించారు. ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉన్న వ్యవహారాల్లో ఏసీబీ ఎందుకు వేలుపెట్టిందని నిలదీశారు. డబ్బులు తీసుకోవడానికి తాను సిద్ధమని, వచ్చి ఇవ్వాలని రేవంత్ ను నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ పిలవడం తప్పుకాదా?... తప్పు చేసిన స్టీఫెన్ ను ఇంత వరకు ఏసీబీ అధికారులు ఎందుకు అరెస్ట్ చేయలేదు? అని గాలి ప్రశ్నించారు. టీఆర్ఎస్, వైకాపాలు ఒక్కటై ఈ కుట్రలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతు పలికినప్పుడే వైకాపా అధినేత జగన్ వైఖరి ఏమిటనేది అర్థమయిందని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News