: రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ ఈ నెల 24కు వాయిదా
టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు ఈ నెల 24కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఏసీబీ స్టాండింగ్ కౌన్సిల్ కు కోర్టు నోటీసులు జారీ చేసిింది. ఓటుకు నోటు కేసులో అరెస్టైన రేవంత్, సెబాస్టియన్, ఉదయసింహ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.