: చంద్రబాబు నివాసం, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు
ఓటుకు నోటు వ్యవహారం కీలక మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో, ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఎత్తులు, పైఎత్తులు వేస్తున్నాయి. హైదరాబాదులో తెలంగాణ పోలీసులతో తమకు భద్రత అవసరం లేదంటూ, ఏపీ పోలీసులను ఆ రాష్ట్ర ప్రభుత్వం పిలిపించుకుంది. ఈ వ్యవహారం సంచలనం రేకెత్తించడమే కాకుండా, వివాదాస్పదం కూడా అయింది. ఈ క్రమంలో, నగరంలో ఉన్న 400 మంది పోలీసులను ఉపసంహరించుకుంటున్నట్టు ఏపీ డీజీపీ రాముడు తెలిపారు. అయితే, చంద్రబాబు నివాసం, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద మాత్రం ఏపీ పోలీసులతో ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో, ఈ రెండు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఏపీ పోలీసులను వెనక్కి పంపలేమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.