: క్రికెట్లో 'స్పాట్ ఫిక్సింగ్' చేసినట్టు మాజీ కెప్టెన్ భట్ అంగీకరించాడు: పీసీబీ


స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడినట్లు పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ అధికారికంగా అంగీకరించాడని పీసీబీ (పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్) వెల్లడించింది. ఈ మేరకు ఆయన స్టేట్ మెంట్ పేపర్స్ పై సంతకాలు చేశాడని తెలిపింది. 2010లో ఇంగ్లాండుతో లార్డ్స్ మైదానంలో జరిగిన టెస్టులో తాను స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడి నోబాల్స్ వేశానని, ఫిక్సింగ్ లో పాల్గొనాలని జట్టు సభ్యులు మహ్మద్ ఆసిఫ్, మహ్మద్ ఆమీర్ లను కోరానని భట్ ఒప్పుకున్నట్టు పీసీబీ అధికారులు తెలిపారు. కాగా, దేశవాళీ టోర్నీలలో ఆడాలన్న కోరికతోనే తాను తప్పు ఒప్పుకున్నట్టు సంతకాలు చేశానని భట్ తెలిపాడు. 2011లో స్పాట్ ఫిక్సింగ్ చేసిన ఆటగాళ్లపై ఐదేళ్ల నిషేధం విధించగా, అది ఈ సంవత్సరం సెప్టెంబరు 1వ తేదీతో ముగియనుంది.

  • Loading...

More Telugu News