: పోలీసు ఎన్ కౌంటర్ లో అకాళీదళ్ నేత మృతి


అమృత్ సర్ లో జరిగిన పంజాబ్ పోలీసుల ఎన్ కౌంటర్ లో బుల్లెట్ తగలడంతో అకాళీదళ్ పార్టీ నేత ముఖజీత్ సింగ్ ముఖ్ మృతి చెందారు. సివిల్ డ్రస్సుల్లో ఉన్న పోలీసులు కారులో వెళుతున్న సింగ్ ను టార్గెట్ చేసి పలుమార్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దాంతో అక్కడికక్కడే ఆయన చనిపోయారు. అయితే పొరబాటుగా ఓ వ్యక్తి బదులు అకాళీదళ్ నేతపై కాల్పులు జరిగాయని, ఓ క్రిమినల్ నేరానికి పాల్పడేందుకు నంబర్ ప్లేటులేని ఐ20 కారులో వెళుతున్నాడని తమకు పక్కా సమాచారం ఉందని పోలీసులు అంటున్నట్టు సమాచారం. అందులో అకాళీదళ్ నేత ఉన్నారని తమకు తెలియదంటున్నారు. అయితే కారులో నుంచి వచ్చిన కాల్పులతో తమ కానిస్టేబుల్ కు గాయాలైనట్టు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News