: ఇంతకీ సండ్ర ఎక్కడ?... ఉదయం నుంచి అడ్రెస్ లేని సత్తుపల్లి ఎమ్మెల్యే!


ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నేటి ఉదయం నుంచి పత్తా లేకుండాపోయారు. వాస్తవంగా ఓటుకు నోటు కేసులో నిన్న రాత్రి వేం నరేందర్ రెడ్డి కంటే ముందుగానే ఏసీబీ అధికారులు సండ్ర వెంకటవీరయ్యకు నోటీసులు జారీ చేశారు. హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని క్వార్టర్ నెం.208లో సండ్ర ఉంటున్న సంగతి తెలిసిందే. ఏసీబీ అధికారులు వెళ్లిన సమయంలో సండ్ర క్వార్టర్ కు తాళం వేసి ఉంది. దీంతో నోటీసు కాపీలను ఏసీబీ అధికారులు కిటికీ ద్వారా సండ్ర క్వార్టర్ లోపలికి వేశారు. ఆ తర్వాత మీడియా ద్వారా విషయం తెలుసుకున్న సండ్ర వెంకటవీరయ్య, ఏసీబీ నోటీసులు తనకు ఇంకా అందలేదని, నోటీసులు అందితే విచారణకు హాజరవుతానని నిన్న రాత్రి ప్రకటించారు. తాజాగా కొద్దిసేపటి క్రితం వేం నరేందర్ రెడ్డి ఏసీబీ విచారణకు కోసం తన ఇంటి నుంచి బయలుదేరారు. అయితే సండ్ర అడ్రెస్ మాత్రం కనిపించలేదు. నేటి ఉదయం ఏ ఒక్క వార్తా ఛానెల్ లోనూ సండ్ర కనిపించలేదు.

  • Loading...

More Telugu News