: గవర్నర్ పదవిలో కొనసాగే నైతిక హక్కు నరసింహన్ కు లేదు: ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు
గవర్నర్ నరసింహన్ పై టీడీపీ నేతల విమర్శల దాడి అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా గవర్నర్ పై రాజోలు టీడీపీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంత జరుగుతున్నా గవర్నర్ మౌనముద్రలో ఉంటున్నారని... ఆయన వ్యవహారశైలిపై తమకు సందేహాలున్నాయని ఆరోపించారు. రాజ్యాంగబద్ధమైన గవర్నర్ పదవిలో కొనసాగే నైతిక హక్కు నరసింహన్ కు లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్, వైకాపాలు కుమ్మక్కై కుట్రలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసు పెడితే, టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తమ ప్రభుత్వం కూడా కేసులు పెడుతుందని హెచ్చరించారు.