: నీ వల్ల పరువు పోతోంది గవర్నరూ... చేతకాకుంటే రాజీనామా చేసిపో: ఎర్రబెల్లి రుసరుస
కేసీఆర్ నేతృత్వంలోని తెరాస సర్కారు తెలుగుదేశం పార్టీ నేతలను కావాలని ఇబ్బంది పెడుతోందని, టీవీలకు, ప్రెస్ కూ లీకులిచ్చి, ఒక ప్లాన్ ప్రకారం కుట్రలు చేస్తోందని తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు విరుచుకుపడ్డారు. ఇంత జరుగుతున్నా గవర్నర్ నరసింహన్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆయన పక్షపాతం చూపుతున్నారని ఆరోపించారు. "నేను ఒక్కటే అంటున్నా, గవర్నరుగారికి కూడా చెబుతున్నా, గవర్నర్... నీ చేతగాకపోతే, రాజీనామా చేసిపో. చేతగాని గవర్నరు, పార్షియాలిటీ ఉన్న గవర్నరూ ఇక్కడ ఉండటం వల్ల మా పరువు పోతున్నది" అన్నారు. మొత్తం వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు.