: చంద్రబాబును కలిసేందుకు వచ్చిన రెబల్ అభ్యర్థి


స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కన్నబాబురాజు ఈరోజు ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి వచ్చారు. విశాఖ ఎమ్మెల్సీ స్థానం నుంచి ఆయన రెబల్ గా బరిలోకి దిగారు. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్ మీటింగ్ లో ఉన్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత చంద్రబాబుతో కన్నబాబు భేటీ కానున్నారు. మంత్రి అయ్యన్నపాత్రుడు కన్నబాబును సచివాలయానికి తీసుకువచ్చారు. రెబల్ అభ్యర్థిగా తన నామినేషన్ ను కన్నబాబు ఉపసంహరించుకోనున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News