: నేటి తరం కోసం... జీన్స్ నుంచి జాకెట్స్ వరకూ 'ఖద్దరు డెనిమ్' వచ్చేసింది


ఫ్యాషన్ ప్రపంచం రోజురోజుకూ మారుతుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త ట్రెండ్స్ పుట్టకురావడమూ సహజమే. అయితే, మూలాలు మరచిపోయి పాశ్చాత్య మోజులో పడిపోయిన యువతీ యువకులకు మనదైన ఖద్దరును సరికొత్తగా పరిచయం చేసింది కేవీఐసీ (ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్). ఖద్దరులో డెనిమ్ ఉత్పత్తులను విడుదల చేసింది. యువతీ యువకుల కోసం వివిధ రంగుల్లో జీన్స్, జాకెట్స్ తదితరాలను అందుబాటులోకి తెచ్చినట్టు కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖా మంత్రి కల్ రాజ్ మిశ్రా తెలిపారు. ఈ దుస్తులకు అంతర్జాతీయ స్థాయిలో మంచి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇండియాలో ఖద్దరుకు మరింత ప్రాచుర్యం కల్పించాలన్న ప్రధాని మోదీ ఆకాంక్షలకు అనుగుణంగా వీటిని విడుదల చేసినట్టు మిశ్రా వివరించారు. జీన్స్ ధరలు ఎంచుకునే సైజును బట్టి రూ. 2,300 నుంచి ప్రారంభమవుతాయని, షర్ట్స్ ధరలు రూ. 1,700 నుంచి రూ. 1,900 మధ్య ఉంటాయని తెలిపారు.

  • Loading...

More Telugu News