: కేసీఆర్ పై దూకుడు పెంచిన బాబు సర్కారు... సిట్ ఏర్పాటు!
తెలుగుదేశం నేతలను 'ఓటుకు నోటు' కేసులో ఇరికించాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్న తెరాస సర్కారును అంతే స్థాయిలో ఎదుర్కోవాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయించింది. ఈ ఉదయం బాబు తన మంత్రివర్గ సహచరులతో సమావేశమై పలు కీలకాంశాలను చర్చిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని పలు పోలీసు స్టేషన్లలో కేసీఆర్ పై నమోదైన కేసుల విచారణ నిమిత్తం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేయాలని కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీంతో పాటు మద్యం విధానం తదితర అంశాలూ చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఏపీ మంత్రిమండలి సమావేశం ఇంకా కొనసాగుతోంది. ఈ సమావేశాలకు చంద్రబాబుతో పాటు హైదరాబాదులో అందుబాటులో ఉన్న పలువురు మంత్రులు హాజరయ్యారు.