: వేం నరేందర్ రెడ్డిని కలిసి ధైర్యం చెప్పిన ఎర్రబెల్లి
ఓటుకు నోటు వ్యవహారంలో నిన్న రాత్రి ఏసీబీ నోటీసులకు సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నప్పటికీ, నేడు నోటీసులు తీసుకుని విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్న వేం నరేందర్ రెడ్డిని ఎర్రబెల్లి దయాకర్ కలిశారు. ఈ ఉదయం ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని ఆయన నివాసానికి వచ్చిన ఎర్రబెల్లి గంటకు పైగా చర్చలు జరిపారు. 'ఏం చేద్దామన్నా?' అని నరేందర్ ప్రశ్నిస్తే, 'మరేమీ ఫర్వాలేదు, నిర్భయంగా విచారణకు వెళ్ల'మని ఎర్రబెల్లి సలహా ఇచ్చినట్టు తెలిసింది. తామంతా నీ వెంటే వుంటామని ఎర్రబెల్లి భరోసా ఇచ్చారట. కాగా, తెలంగాణ ఏసీబీ అధికారులు మరికాసేపట్లో వేం నరేందర్ నివాసానికి వెళ్లి మరోసారి నోటీసులిచ్చి విచారణకు హాజరు కావాలని ఆదేశించనున్నట్టు తెలుస్తోంది.