: 'ఆరాధ్య ఎలా స్పందిస్తుందో?' అని మురిసిపోతున్న అమితాబ్
తన మనవరాలు ఆరాధ్య గురించిన కబుర్లు చెబుతూ 'బిగ్ బీ' అమితాబ్ బచ్చన్ మురిసిపోతున్నారు. "నన్ను పోలిన ఓ యానిమేషన్ పాత్ర 'ఆస్ట్రా' పేరిట తయారవుతోందని ఆరాధ్యకు తెలియదు. తెలిస్తే ఏమంటుందో చూడాలి" అని అంటున్నారు. స్కూలు నుంచి వస్తే ఐపాడ్ చేతికి తీసుకుని గేమ్స్ ఆడేస్తుందని, అన్నం తినాలంటే, టీవీ పెట్టాల్సిందేనని బోలెడు కబుర్లు చెబుతున్నారు. రోజూ ఆరాధ్యకు మహాభారతం, రామాయణం కథల్ని చెబుతున్నానని అన్నారు. "జీవితంలో పలు దశలు దాటి మనవరాలితో ఆడుకునే దశలోకి వచ్చాను. ఈ క్షణాలే నా జీవితంలో అత్యంత ఆనందమయమైన సమయం" అంటున్నారు అమితాబ్.