: మా పోలీసులను రీకాల్ చేశాం... గవర్నర్ కు ఏపీ డీజీపీ సమాచారం
ఓటుకు నోటు కేసులో కేంద్రం రంగంలోకి దిగినట్టే కనిపిస్తోంది. కొద్దిసేపటి క్రితం ఏపీ డీజీపీ జేవీ రాముడు కీలక సమాచారాన్ని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కు చేరవేశారు. హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో మోహరించిన తమ పోలీసులను రీకాల్ చేశామని రాజ్ భవన్ కు రాముడు సమాచారమందించారు. ఓటుకు నోటు కేసులో ఏసీబీ నోటీసులు, తెలంగాణ ప్రభుత్వ పెద్దల ప్రకటనల నేపథ్యంలో ఏపీ సీఎం ఇల్లు, కార్యాలయం, టీడీపీ పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ తదితరాల వద్ద ఏపీ పోలీసులను మోహరించారు. తాజాగా వారందరినీ వెనక్కు పిలిచినట్లు జేవీ రాముడు గవర్నర్ కు సమాచారం అందించారు.