: తెలంగాణ ప్రతిపాదనలు బుట్టదాఖలు... గడ్కరీతో తేల్చుకోనున్న టీ-మంత్రి
జాతీయ రహదారుల విషయంలో 'ఆంధ్రప్రదేశ్ ముద్దు-తెలంగాణ వద్దు' అన్నట్టు కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీ వెళ్లి తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఏపీలో 707 కి.మీ. మేర నాలుగు లైన్ల రోడ్ల నిర్మాణానికి అనుమతినిస్తూ, వాటికి జాతీయ హోదా కల్పించిన కేంద్రం, తెలంగాణ ప్రతిపాదించిన 1000 కి.మీ.పైగా రోడ్లను పక్కన పెట్టింది. తెలంగాణకు కొత్త ప్రాజెక్టులు ఇస్తామని చెప్పి, ఆపై వాటి ఊసే ఎత్తని కేంద్రం వైఖరి విషయంలో కోపంగా ఉన్న కేసీఆర్, తక్షణం ఢిల్లీ వెళ్లాలని తుమ్మలను ఆదేశించారు. మరో రెండు రోజుల్లో గడ్కరీని కలిసేందుకు తుమ్మల ఢిల్లీ వెళ్లనున్నారని తెలుస్తోంది.