: స్టీఫెన్ సన్ వాంగ్మూలం నమోదుకు రంగం సిద్ధం...స్టీఫెన్ సన్ కూతురు వాంగ్మూలం కూడా!
ఓటుకు నోటు కేసులో నేడు కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలున్నాయి. తనను ప్రలోభపెట్టిన టీ టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డిని అడ్డంగా బుక్ చేయించిన తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్ సన్ వాంగ్మూలాన్ని ఏసీబీ అధికారులు నమోదు చేయనున్నారు. హైదరాబాదు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సమక్షంలో స్టీఫెన్ సన్ వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు ఇప్పటికే ఏసీబీ అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇక ఈ కేసులో స్టీఫెన్ సన్ కూతురు జెస్సీకా వాంగ్మూలాన్ని కూడా ఏసీబీ అధికారులు సేకరించనున్నారు. స్టీఫెన్ సన్ నివాసముంటున్న ఫ్లాట్ ఓనర్ మాల్కం టేలర్ వాంగ్మూలాన్ని కూడా నమోదు చేయనున్నారు.