: రంగంలోకి టీజేఏసీ... సెక్షన్ 8, ఓటుకు నోటుపై నేడు కీలక భేటీ!


ఓటుకు నోటు వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టింది. రేవంత్ రెడ్డి అరెస్టు, టీడీపీ నేతల విచారణకు తెలంగాణ ఏసీబీ నోటీసుల జారీతో ఇరు రాష్ట్రాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సెక్షన్ 8పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి (టీ జేఏసీ) నిన్నటిదాకా ఈ విషయంపై నోరు విప్పలేదు. తాజాగా నేడు అత్యవసర భేటీ నిర్వహించాలని టీజేఏసీ నేతలు నిర్ణయించారు. మరికాసేపట్లో మొదలుకానున్న ఈ భేటీలో సెక్షన్ 8, ఓటుకు నోటు కేసులో ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభేదాలు ప్రధానంగా చర్చకు రానున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News