: తదుపరి చర్యలేంటీ?... మరికాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ


ఓటుకు నోటు కేసులో తెలంగాణ సర్కారు స్పీడు పెంచింది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన ఆ రాష్ట్ర ఏసీబీ అధికారులు, ఈ కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న టీడీపీ నేతలకు నోటీసుల జారీకి తెరలేపింది. ఇందులో భాగంగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డిలకు నోటీసులు జారీ చేసింది. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడికి కూడా నోటీసుల జారీకి సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఏసీబీ చర్యలకు ఏ విధంగా స్పందించాలన్న విషయంపై ఏపీ సర్కారు దృష్టి సారించింది. ఇందులో భాగంగా నేటి ఉదయం ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన 10 గంటలకు ప్రారంభం కానున్న ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నట్లు సమాచారం. తెలంగాణ సర్కారు చర్యలకు దీటుగా వ్యవహరించే దిశగా ఏపీ సర్కారు నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో నేటి కేబినెట్ భేటీపై ఇరు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది.

  • Loading...

More Telugu News