: కృష్ణా కరకట్ట సమీపంలో ఏసీ సీఎం తాత్కాలిక నివాసం


ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఇకపై వారంలో మూడు రోజుల పాటు విజయవాడలో మకాం వేయనున్నారు. మరో రోజు ఏపీలోని జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ క్రమంలో వారంలో దాదాపుగా నాలుగు రోజుల పాటు ఆయన ఏపీ పరిధిలోనే ఉండనున్నారు. ఇప్పటికే క్యాంపు కార్యాలయం ఏర్పాటైనా, నివాసం మాత్రం ఖరారు కాలేదు. తాజాగా గుంటూరు జిల్లా పరిధిలోని ఓ భవనాన్ని ఏపీ సీఎంకు తాత్కాలిక నివాసంగా అధికారులు ఎంపిక చేశారు. క్యాంపు కార్యాలయానికి సమీపంలో గుంటూరు జిల్లా పరిధిలోని ప్రాంతంలో ఈ భవనం ఉంది. సీతానగరం ప్రకాశం బ్యారేజీ నుంచి రెండు కిలో మీటర్ల దూరంలో కృష్ణా కరకట్ట రోడ్డుపై ఉన్న లింగమనేని గెస్ట్ హౌస్ ను అధికారులు చంద్రబాబు తాత్కాలిక నివాసంగా ఎంపిక చేశారు. నిన్న సీఎం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ సురేంద్రబాబు, గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, విజయవాడ నగర కమిషనర్ వీరపాండ్యన్, గుంటూరు ఆర్డీఓ భాస్కరనాయుడు తదితరులు ఈ భవనాన్ని పరిశీలించారు. అంతేకాక సదరు భవనానికి దారితీసే రోడ్డును విస్తరించేందుకు చర్యలు చేపట్టారు.

  • Loading...

More Telugu News