: సెక్షన్-8 అమలు చేయకపోతే హైదరాబాదులో ఏపీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసుకుంటాం: చినరాజప్ప
హైదరాబాదులో సెక్షన్-8 అమలు చేయాల్సిందేనని, లేకుంటే తాము హైదరాబాదులో ఏపీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసుకుంటామని ఏపీ హోం మంత్రి చినరాజప్ప స్పష్టం చేశారు. ఏపీ సీఎంకు, మంత్రులకు తెలంగాణలో రక్షణ లేదని అన్నారు. అందుకే ఏపీ పోలీసులతో భద్రత ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకుని సెక్షన్-8ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక, ఏపీలో కేసీఆర్ పై నమోదైన కేసుల్లో విచారణ జరుపుతున్నామని తెలిపారు. ఏపీ మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ కు గురైనట్టు ఆధారాలున్నాయని వివరించారు. కేసీఆర్, జగన్ కలిసి అన్యాయంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు.