: మరికొద్ది గంటల్లో సంచలనం జరగబోతోంది: టీడీపీ నేత కొత్తకోత దయాకర్ రెడ్డి


తెలంగాణ టీడీపీ నేత కొత్తకోట దయాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ... మరికొద్ది గంటల్లో సంచలనం జరగబోతోందని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి అన్ని ఆధారాలు లభ్యమయ్యాయని తెలిపారు. ఈ కేసులో ఐదుగురి అరెస్టు ఖాయమని అన్నారు. ప్రభుత్వంలోని ప్రధానమైన వ్యక్తులు కూడా అరెస్టు కాబోతున్నారని అన్నారు. ఇద్దరు ఐపీఎస్ అధికారులు, మరో ఐఏఎస్ అధికారి కూడా అరెస్టు అవుతారని చెప్పారు. అందరి ప్రమేయంపై స్పష్టమైన సాక్ష్యాధారాలు ఉన్నాయని తెలిపారు. వారి పాత్ర నిర్ధారణ అయిందని స్పష్టం చేశారు. వారందరినీ అరెస్టు చేసి జైలుకు తరలిస్తారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ అత్యంత ఓపికతో వ్యవహరించిందని, పరిస్థితులన్నంటినీ గమనించి, పకడ్బందీ ఆధారాలు సంపాదించేవరకు చాలా సహనం పాటించామని తెలిపారు.

  • Loading...

More Telugu News