: సుష్మా స్వరాజ్ కు కేంద్ర హోం, ఆర్థిక శాఖ మంత్రుల బాసట
ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీకి వీసా విషయంలో సాయం చేసి వివాదాల్లో చిక్కుకున్న విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మద్దతుగా నిలిచారు. మంచి పనులు చేసే వారిని అందరూ అభినందించినట్లే తాము కూడా సుష్మాకు బాసటగా నిలిచామని మంత్రులు తెలిపారు. ఈ మేరకు ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రులు మాట్లాడారు. ఆమె (సుష్మ) మంచి ఉద్దేశంతో వ్యవహరించినందునే పార్టీ, ప్రభుత్వం అండగా నిలిచాయని చెప్పారు. సదరు వ్యక్తి (లలిత్ మోదీ)కి సంబంధించిన పలు కేసులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేసిందని, వాటిలో చాలా వాటికి షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసిందని ఈ సందర్భంగా వివరించారు. అయితే మీడియా సమావేశానికి ముందు రాజ్ నాథ్, జైట్లీలు సుమారు గంటపాటు సుష్మాతో భేటీ అయ్యారు.