: గవర్నర్ తో భేటీ అయిన ఏపీ సీఎస్, డీజీపీ
ఓటుకు నోటు వ్యవహారం మరింత తీవ్రత సంతరించుకుంది. ఏపీ సీఎం చంద్రబాబుకు మంగళవారం నోటీసులు పంపే అవకాశాలున్నాయంటూ మీడియాలో వార్తలు రావడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ క్రమంలో తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ గవర్నర్ నరసింహన్ ను కలిసి ఏపీ పోలీసులపై ఫిర్యాదు చేయడం తెలిసిందే. అనంతరం, ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ జేవీ రాముడు కూడా రాజ్ భవన్ లో గవర్నర్ తో భేటీ అయ్యారు. ఓటుకు నోటు వ్యవహారంలో తాజా పరిణామాలు, హైదరాబాదులో శాంతిభద్రతలు, సీఎం చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ తదితర అంశాలపై వారు గవర్నర్ తో చర్చించనున్నారు.