: పడి లేచిన స్టాక్ మార్కెట్లు
ఈ రోజు ప్రారంభం నుంచి తీవ్ర ఒత్తిడికి లోనైన స్టాక్ మార్కెట్లు చివరి గంటలో పుంజుకుని, లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 100 పాయింట్ల లాభంతో 26,687కు పెరిగింది. నిఫ్టీ 33 పాయింట్లు లాభపడి 8,047కు చేరింది. ఈనాటి టాప్ గెయినర్లలో జెట్ ఎయిర్ వేస్, సెంచురీ టెక్స్ టైల్స్, ఒబెరాయ్ రియాల్టీ, ఎన్ సీసీ, కైలాష్ ఆటో ఫైనాన్స్ లు ఉన్నాయి. నష్టపోయిన జాబితాలో ఐడియా సెల్యులార్, పీఎంసీ ఫిన్ కార్ప్, రతన్ ఇండియా పవర్, జై ప్రకాశ్ పవర్ వెంచర్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్ లు ఉన్నాయి.