: ఏపీ పోలీసులపై గవర్నర్ కు డీజీపీ అనురాగ్ శర్మ ఫిర్యాదు


ఓటుకు నోటు వ్యవహారం ఇరు రాష్ట్రాల మధ్య తీవ్ర వివాదంగా మారింది. ఈ నేపథ్యంలో, ఏపీ పోలీసులపై తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశారు. హైదరాబాదులో ఏపీ పోలీసుల మోహరింపును డీజీపీ తప్పుబట్టారు. ఏపీ పోలీసుల తీరు అభ్యంతరకరమని అన్నారు. హైదరాబాద్ నగర శాంతిభద్రతల పరిరక్షణ తమ చేతుల్లో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇలాగే వ్యవహరిస్తే ఏపీ నేతలకు భద్రత ఉపసంహరించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News