: తెలంగాణ చర్యకు మా ప్రతిచర్య ఉంటుంది: యనమల హెచ్చరిక


ముడుపుల వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబుకు మరికాసేపట్లో నోటీసులు జారీ చేసే అవకాశాలున్నట్టు మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు మీడియాతో మాట్లాడుతూ.... తెలంగాణ చర్యకు తమ ప్రతి చర్య ఉంటుందని హెచ్చరించారు. నోటీసులిచ్చే అధికారం తెలంగాణ ప్రభుత్వానికి ఉంటే, తమకూ ఆ అధికారం ఉంటుందని స్పష్టం చేశారు. ఏపీలో కేసీఆర్ పై 87 కేసులు నమోదయ్యాయని వివరించారు. చంద్రబాబుకు నోటీసులు పంపితే, ఆ 87 కేసుల విషయంలో తెలంగాణ సీఎంకు నోటీసులు వెళతాయని తెలిపారు.

  • Loading...

More Telugu News