: నార్తిండియన్లలో రక్తస్రావం జాస్తి


జన్యుపరమైన నిర్మాణం కారణం కావచ్చునని భావిస్తున్న ప్రకారం.. నార్తిండియన్లలో రక్తస్రావానికి సంబంధించిన సమస్యలు ఎక్కువ అని ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రి నిపుణులు నిగ్గు తేల్చారు. 291 మందిపై ఇక్కడి డాక్టర్లు పరిశోధనలు నిర్వహించారు. గుండె ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు యాంటీ కోయాగులెంట్‌ ఇస్తారు. ఇది రక్తాన్ని పలుచన చేస్తుంది. ఈ మందుకు శరీరం అతిగా స్పందిస్తే రక్తస్రావం అవుతుంది. అయితే ఈ సమస్య ఉత్తర భారతీయుల్లోనే ఎక్కువట.

ఇది మందుగురించి చేసిన అధ్యయనమే అయినా ఫలితాలు కీలకమైనవని ఆస్పత్రికి చెందిన డాక్టర్‌ రిషా నహర్‌ లుల్లా తెలిపారు. గుండె జబ్బుల చికిత్సలో ఈ యాంటీ కోయాగులెంట్‌ లు ఇవ్వడం అధికం అని, ఉత్తర భారతీయులకు అది తక్కువగా ఇవ్వాల్సి ఉంటుందని ఆయన తేల్చారు.

  • Loading...

More Telugu News