: చట్ట ప్రకారం ముందుకు వెళ్లండి: తెలంగాణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
ఓటుకు నోటు వ్యవహారంలో చట్ట ప్రకారం ముందుకెళ్లాలని కేంద్రం నుంచి తెలంగాణ సర్కారుకు ఆదేశాలందినట్టు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి సమగ్ర వివరాలతో కేంద్రానికి 17 పేజీల నివేదికను తెలంగాణ ఏసీబీ అధికారులు పంపగా, వాటిని పరిశీలించిన హోం శాఖ అధికారులు, ఈ కేసులో పలువురు నేతలపై వ్యతిరేకంగా ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని భావిస్తూ, ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ మేరకు సమాచారం అందిన తరువాతనే కేసీఆర్ సర్కారు తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలకు నోటీసులిచ్చి ప్రశ్నించేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది.