: ఏపీలో ఎమ్మెల్సీ నామినేషన్ల దాఖలుకు ముగిసిన గడువు
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. 9 జిల్లాల్లో 12 ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. కొన్ని జిల్లాల్లో అయితే ఒక్కొక్క నామినేషన్ దాఖలైంది. ప్రధానంగా విశాఖ, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో టీడీపీ, వైసీపీల మధ్యే పోటీ నెలకొంది. కాగా విశాఖ, కాకినాడలో కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్లు వేశారు.