: వారం రోజులు బుకాయించి, ఇప్పుడు తప్పు ఒప్పుకున్న ఆప్ నేత


నకిలీ సర్టిఫికెట్ల కేసులో అరెస్టైన ఢిల్లీ మాజీ న్యాయశాఖ మంత్రి, ఆప్ నేత జితేంద్ర సింగ్ తోమర్ ఎట్టకేలకు తాను తప్పు చేశానని ఒప్పుకొన్నారు. తన అరెస్ట్ అక్రమమంటూ గగ్గోలు పెట్టిన తోమర్... చివరకు, తాను ఢిల్లీ బార్ కౌన్సిల్ కు సమర్పించిన సర్టిఫికెట్లు నకిలీవని ఒప్పేసుకున్నారు. తమ విచారణలో ఆయన ఈ విషయాన్ని చెప్పినట్టు పోలీసులు తెలిపారు. 2001లో మదన్ అనే ఏజెంట్ ద్వారా డిగ్రీ పొందానని, అనంతరం భగల్ పూర్ యూనివర్శిటీ నుంచి ఎల్.ఎల్.బి సర్టిఫికెట్ ను సంపాదించినట్టు తోమర్ అంగీకరించారు. చదువులో వెనకబడటం వల్ల పరీక్షల్లో పాస్ కాలేదని... అయితే, రాజకీయాల్లో ఎదగాలంటే, డిగ్రీలు ఉండాలనే ఉద్దేశంతోనే ఇలా చేశానని చెప్పారు. తోమర్ తన తప్పును అంగీకరించడంతో ఆప్ ఇరకాటంలో పడినట్టైంది.

  • Loading...

More Telugu News