: తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీ షెడ్యూల్ విడుదల


తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీ షెడ్యూల్ విడుదలైంది. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి షెడ్యూల్ ను విడుదల చేశారు. నేటి నుంచి జులై 16 వరకు ఉపాధ్యాయుల బదిలీలు జరగనున్నాయి. ఈ నెల 22 నుంచి 25 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 26న విభాగాల వారీగా ఉపాధ్యాయ ఖాళీల తుదిజాబితా పెట్టనున్నారు. రంగారెడ్డి జిల్లాకు ఇతర చోట్ల నుంచి బదిలీలు, డిప్యుటేషన్ల అనుమతిని నిరాకరిస్తున్నారు. ఎనిమిదేళ్లు ఒకేచోట పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఐదేళ్ల సర్వీసు దాటిన ప్రధానోపాధ్యాయులకు తప్పనిసరిగా బదిలీ చేస్తారు. షెడ్యూల్ విడుదల అనంతరం కడియం మాట్లాడుతూ, బదిలీ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందన్నారు. కౌన్సెలింగ్ తేదీని మాత్రమే ఆన్ డ్యూటీగా పరిగణిస్తామని, కౌన్సెలింగ్ లేనివారు యథావిధిగా విధులకు హాజరుకావాలని చెప్పారు.

  • Loading...

More Telugu News