: ఆ రెండు పార్టీలూ తెలంగాణకు అవసరమా?: హరీష్ రావు
టీడీపీ, వైకాపాలపై టీఎస్ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఈ పార్టీలు ఇక్కడ అవసరమా? అని ప్రశ్నించారు. హైదరాబాదులో ఉంటూ, ఇక్కడి నీళ్లు తాగుతూ కూడా తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న వారు ఇక్కడెలా ఉంటారని నిలదీశారు. తమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా జగన్ కేంద్రానికి లేఖ ఎలా రాస్తారని అన్నారు. ఓటుకు నోటు కేసు నుంచి చంద్రబాబు బయటపడలేరని చెప్పారు. గవర్నర్ పై ఆరోపణలు చేస్తూ, రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తున్న ఏపీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని అన్నారు.